జై బాలయ్య సాంగ్ ను పిచ్చ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్...!!

murali krishna
నందమూరి బాలకృష్ణ(Balakrishna), క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో `వీర సింహారెడ్డి` అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను అయితే పోషిస్తుంది.
ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుక కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు అయితే చేరుకుంది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు సైతం ప్రారంభం అయ్యాయి. ఇక విడుదలకు కొద్ది రోజుల సమయమే ఉండటంతో.. మేకర్స్‌ ప్రమోషన్స్ షురూ కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే నిన్న ఈ సినిమా ఫస్ట్ సింగల్ `జై బాలయ్య(jai balayya)` మాస్ ఆంథమ్ సాంగ్ ను బయటకు వదిలారు. `రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..` అంటూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ సాగిన ఈ సాంగ్ కు మంచి స్పందన వస్తుందని అయితే భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సాంగ్ నెగటివ్ టాక్ ను అయితే మూటగట్టుకుంది.
ఎందుకంటే `జై బాలయ్య` పాట అటు ఇటుగా `ఒసేయ్ రాములమ్మ` సాంగ్ ను అయితే పోలి ఉంది. పైగా ఈ సాంగ్ లో నందమూరి ఫ్యాన్స్ స్లోగన్ `జై బాలయ్య` వాడటం పెద్ద మైనస్ గా అయితే మారింది. ఈ చిత్రంలో హీరో పేరు వీర సింహారెడ్డి(veera simha reddy) అయినప్పుడు జై బాలయ్య ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నెటిజన్లు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లాజిక్ పాడు లేకుండా ఇవేం పనులు అస్సలు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ట్రోల్ చేస్తున్నారు.. మొత్తానికి ఫస్ట్ సింగల్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అయితే భావించారు. కానీ పెద్ద మైనస్ గా అయితే మారింది. ఈ సాంగ్ వల్ల సినిమాకు ఉన్న హైప్ కూడా పోయిందని సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: