"హిట్ 2" ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించిన టాలీవుడ్ స్టార్ హీరో..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున "హిట్ ది సెకండ్ కేస్" మూవీ ట్రైలర్ పై స్పందిస్తూ ... కొద్ది సేపటి క్రితం హిట్ 2 మూవీ ట్రైలర్ ను చూసాను. ఇటీవల చూసిన టీజర్ తో పాటు ట్రైలర్ కూడా ఎంతో బాగుండడంతో మూవీ పై పై మంచి ఆసక్తి ఏర్పరిడింది, మూవీ కోసం ఎదురుచూస్తున్నాను అడివి శేష్ అంటూ నాగార్జున తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నాగార్జున సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: