వరసు మూవీ "యూకే" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని , కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా విజయ్ బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం విడుదల అయిన బీస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
 

ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. రష్మిక మందన ఈ క్రేజీ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. 2023 వ సంవత్సరం పొంగల్ కానుక గా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను కూడా ఇప్పటికే ప్రారంభించింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యూకే హక్కులను కూడా అమ్మి వేసింది. ఈ సినిమా యూకే హక్కులను ప్రముఖ సంస్థ అయినటువంటి ఆసీమా ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఈ మూవీ ని యూకే లో విడుదల చేయనుంది. వరిసు మూవీ పై దళపతి విజయ్ అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: