బన్నీతో పవన్ డైరెక్టర్.. ఈ సారైనా కుదురుతుందా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే, ఇక ఈ సినిమా సెట్ లో తరుచూ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కనిపిస్తున్నాడు.ఇదిలావుంటే ఇక బన్నీను ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చట్లు పెడుతున్నాడు.ఇక  ఉన్నట్టు ఉండి హరీష్ శంకర్, బన్నీను ఎందుకు పదే పదే కలుస్తున్నాడు ? ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. అయితే వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందా ?. నిజానికి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ డేట్లు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ, ఇక రాజకీయాలు, ఆల్ రెడీ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కారణంగా పవన్,

 హరీష్ శంకర్ కి డేట్లు ఇస్తాడా ?, ఇదే డౌట్ హరీష్ శంకర్ కి కూడా ఉండి ఉండొచ్చు.ఇక అందుకే, బన్నీని టార్గెట్ చేశాడా ?, దువ్వాడ జగన్నాథమ్ తర్వాత అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కలిసి మళ్లీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఇక సినిమా కుదరలేదు.అయితే  అప్పట్లో బన్నీ కోసం హరీష్ శంకర్ ఏడాదిపాటు కథ పై కూడా కూర్చున్నాడు. ఇదిలావుంటే ఇక బన్నీ కూడా పలుమార్లు కథ విని వర్క్ చేయమంటూ చాలా ల్యాగ్ చేశాడు.ఇకపోతే చివరకు కథ నచ్చలేదు, నేను ఈ సినిమా చేయలేను అంటూ బన్నీ హరీష్ శంకర్ సినిమాకి డేట్లు ఇచ్చాడు.

ఇక  కట్ చేస్తే.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత బన్నీ - హరీష్ శంకర్ కలయికలో సినిమా అంటూ కొత్త పుకారు వైరల్ అవుతుంది.అంతేకాదు పైగా అల్లు అర్జున్ - హరీష్ శంకర్ మధ్య స్నేహం కూడా మళ్ళీ చిగురించింది. బన్నీ కోసం హరీష్ శంకర్ ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట.అయితే  తాజాగా బన్నీని కలిసింది కూడా.. తానూ చేయబోతున్న కథకు సంబంధించిన ఆలోచనను చెప్పడానికేనట.కాగా  బన్నీకి కథ ఓకే.ఇక  పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ రేంజ్ ఇంకా పెరగొచ్చు. అప్పుడు లెక్కలను బట్టి ఈ సినిమా ఉంటుందా ? లేదా ? అనేది క్లారిటీ వస్తోంది. అయితే మరీ బన్నీ - హరీష్ ప్రాజెక్టు ఒకప్పుడు చెడింది, మరీ ఇప్పుడైనా కుదురుతుందా ? చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: