"గోల్డ్" కి దూరంగా నయనతార?

Purushottham Vinay
మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌  నయనతార కాంబోలో వస్తున్న సినిమా గోల్డ్‌. ఈ సినిమా రిలీజ్‌ అప్‌డేట్‌ను వీడియో ద్వారా అందించారు ఈ మూవీ మేకర్స్.బ్లాక్  బస్టర్  హిట్  మూవీ ప్రేమమ్‌  ఫేం అల్ఫోన్స్‌  పుత్రేన్‌ డైరెక్ట్‌  చేస్తున్నాడు. మలయాళం, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల అప్‌డేట్‌ను వీడియో ద్వారా అందించడం జరిగింది.డిసెంబర్ 1న తమిళం ఇంకా అలాగే మలయాళ భాషల్లో విడుదల కానుంది గోల్డ్‌. మార్కెట్‌లో బంగారం విలువ అనేది ఎప్పుడూ కూడా టాప్‌లో ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ఆ బంగారాన్ని పూర్తి వినోదం కోసం కరిగించడం జరిగింది.. డిసెంబర్‌ 1 వ తేదీన థియేటర్లలో ఎంజాయ్ చేయండి అంటూ మేకర్స్ షేర్ చేసిన వీడియో సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచుతోంది. 


అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం నాయనతారా దూరంగా ఉంది. అయితే ఆమె ఈ ఒక్క సినిమాకే కాదు. తాను నటించిన ప్రతి సినిమాకి కూడా ప్రమోషన్స్ చెయ్యకుండా దూరంగానే ఉంటుంది. సినిమా చేసామా డబ్బులు తీసుకున్నామా అంతే. ఇక ఆ సినిమా ఏమైనా పర్లేదు అనే స్వభావం కలది నయనతార.అయితే ఇక నయనతార తీరు మాత్రం అభిమానులకు నచ్చడం లేదు. మరి ఆమె తన తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి.


అయితే ఇక పృథ్విరాజ్‌ సుకుమారన్‌, నయనతార సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో గోల్డ్‌ సినిమా తెలుగులో ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో కృష్ణ శంకర్‌, అజ్మల్‌ అమీర్‌, శబరీశ్‌ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కామెడీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో పృథ్విరాజ్‌ ప్రొడక్షన్స్‌ అండ్ మ్యాజిక్‌ ఫ్రేమ్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది గోల్డ్‌ సినిమా. ఈ సినిమాకి రాజేశ్‌ మురుగేశన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: