ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం: అల్లరి నరేష్ ఆకట్టుకున్నాడా?

Purushottham Vinay
తెలుగు టాలెంటెడ్ హీరో నరేష్ లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు ఏ ఆర్ మోహన్ ఈ సినిమాని తీసాడు. నవంబర్ 25న అనగా ఈరోజు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా థియేటర్స్ లో విడుదలైంది.సినిమా కథ విషయానికి వస్తే..ఈ సినిమాలో శ్రీనివాస్ శ్రీపాద(అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్. అతను ఎలక్షన్ డ్యూటీ పై మారేడుమిల్లి గ్రామానికి వెళతాడు. మారేడుమిల్లి అనే ఒక ఊరు ఉందని, అది దేశంలో ఒక భాగం అని కూడా తెలియదు. సమాజానికి చాలా దూరంగా బ్రతుకుతున్న మారేడుమిల్లి తండా ప్రజలను, వారి కష్టాలను ఇంకా అలాగే అక్కడ జరుగుతున్న అన్యాయాలను శ్రీనివాస్ శ్రీపాద ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాడు. దాని కోసం వ్యవస్థ మీదే అతను పోరాటం మొదలుపెడతాడు. మారేడుమిల్లి గ్రామ ప్రజల కష్టాలు తీర్చడంలో శ్రీనివాస్ శ్రీపాద ఎంత దాకా సక్సెస్ అయ్యారనేది ఈ సినిమా కథ...ఈ కాలంలో కూడా కొండ కోనల్లో అనాగరికులుగా బ్రతికేస్తున్న ప్రజలు చాలా మందే ఉన్నారు.పాపం వారి గురించి ఏ ప్రభుత్వం నాయకులు కూడా పట్టించుకోరు.


వారి హక్కుల గురించి తెలియని గిరిజనులు ఎలాంటి ఆదరణ ఇంకా అభివృద్ధి చెందడం లేదు. విద్యా, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా దేవుడిపై భారం వేసి వారు బ్రతికేస్తుంటారు.ఇక వారిపై జరిగే అన్యాయాలు, అక్రమాలు కూడా బయటకు రావు.ఇలాంటి ఓ మంచి టాపిక్ తీసుకొని వాస్తవ సంఘటనల ఆధారంగా ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం మూవీని తీశారు. హీరో నరేశ్ మరోసారి సీరియస్ పాత్ర చేశారు. కామెడీ హీరోగా ఎన్నో సంచలనాలు క్రియేట్  చేసిన అల్లరి నరేష్ కి ఆ ఫార్మాట్  ఇప్పుడు కలిసి రావడం లేదు. అందుకే నాంది ఇంకా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి కథలు చేస్తున్నారు.ఈ మూవీతో అల్లరి నరేష్ చాలా బాగా ఆకట్టుకున్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను చర్చిస్తూ, వాస్తవాలకు అద్దం పట్టేలా ఈ మూవీ ఉంది. స్కూల్ టీచర్ గా ఇంకా అలాగే ఎలక్షన్ అధికారిగా అల్లరి నరేష్ నటన చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సీరియస్ సన్నివేశాల్లో అయితే ఆయన పెర్ఫార్మన్స్ చాలా బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: