బిగ్ బాస్ 6 ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా స్టార్ హీరో ...ఎవరో తెలిస్తే షాకే..!?

Anilkumar
మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 చివరిదశకు వచ్చేసింది..ప్రారంభం లో అట్టర్ ఫ్లాప్ సీజన్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు..ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్కులను చాలా తేలికగా తీసుకోవడం వల్లే ప్రారంభం లో అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేసింది ఈ సీజన్..కానీ ఇక మూడవ వారం లో నాగార్జున హౌస్ మేట్స్ అందరికి గట్టిగా కోటింగ్ ఇవ్వడం తో అందరూ గేమ్ ని సీరియస్ గా తీసుకొని ఆడడం మొదలెట్టారు.అంతేకాదు బిగ్ బాస్ కూడా టాస్కులను ఆసక్తికరంగా మార్చి ప్రేక్షకులకు వినోదం ని పంచడానికి తన బెస్ట్ బాగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు.. 

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ షో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతుంది..ఇక గడిచిన సీజన్స్ లో సోషల్ మీడియా కారణంగా బిగ్ బాస్ లో తదుపరి ఏమి జరగబోతుంది..ఇకపోతే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది వీకెండ్ కి ముందే తెలిసిపోయేది..కానీ ఈ సీజన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలకు పూర్తి బిన్నంగా ఊహించని మలుపులతో ఈ షో ముందుకు సాగుతుంది.టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనే విషయం కాసేపు పక్కన పెడితే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడే లీక్ అయిపోయింది..

అయితే చివరి ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా రావాలని నందమూరి బాలకృష్ణ ని బిగ్ బాస్ టీం ఇటీవలే సంప్రదించినట్టు తెలుస్తుంది..బిగ్ బాస్ సీజన్ 4 మరియు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఎంత అద్భుతంగా అలరించాడో అంత తేలికగా మరచిపోలేము..ఇక ఈ రెండు ఫినాలే ఎపిసోడ్స్ కి అదిరిపొయ్యే టీఆర్ఫీ రేటింగ్స్ కూడా వచ్చాయి.అయితే సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కి మాత్రం ముఖ్య అతిధులుగా ఎవ్వరు హాజరు కాలేదు..ఇక దీనితో సీజన్ 6 గ్రాండ్ ఫినాలే కి నందమూరి బాలకృష్ణ ని గెస్ట్ గా రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది..'కాగా అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ద్వారా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులను అలరించిన బాలయ్య బాబు ఇప్పుడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎలాంటి వినోదం ని పంచబోతున్నాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: