బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ దివి.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో?

praveen
తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్లుగా వెళ్లినవారు ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకోవడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా బిగ్ బాస్ ద్వారా నక్క తోక తొక్కిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది దివి అని చెప్పాలి. 2018లో లెట్స్ గో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.

 ఇక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ని నడిపించింది. అంతలోనే బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. ఇక తన అందం అభినయంతో బిగ్ బాస్ షోలో ఆకట్టుకుంది దీవి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దివి గురించి మాట్లాడుతూ మెలికలు తిరిగిపోవడం లాంటివి చూసి అభిమానుల దృష్టి దివి పైకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇక తన సినిమాలు ఛాన్స్ ఇస్తానంటూ మాట ఇచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

 ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కాస్త పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిందట. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించడానికి సుకుమార్ ఈ అమ్మడును  ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రముఖ టీవీ జర్నలిస్టుతో వర్క్ షాప్ నిర్వహించి దివికి ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి కూడా సుకుమార్ సిద్దమయ్యాడట. ఒకవేళ గాడ్ ఫాదర్ సినిమాలో మాదిరిగానే పుష్ప సినిమాలో కూడా దివి పాత్ర హిట్ గా నిలిచిందంటే ఈ అమ్మడు కెరీర్ కీలక మలుపు తిరగడం ఖాయం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: