సమంతకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టిన యశోద..!
ఇకపోతే ప్రస్తుతం ఈమె నటించిన తెలుగు పాన్ ఇండియా చిత్రం యశోద.. థియేటర్లలో విడుదల అయ్యి మొదటి రెండు రోజులు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత మిశ్రమ స్పందన పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్ట లేకపోతోందని చెప్పవచ్చు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు హరి హరీష్ దర్శకత్వంలో కృష్ణలెంక శివప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే త్వరలోనే ఈ సినిమా రెండు మూడు భాగాలు కూడా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కలెక్షన్స్ ఘోరంగా పడిపోతున్నాయని చెప్పాలి. మిలియన్ డాలర్ క్లబ్లో చేరదు అని కేవలం $750K ముగింపు కలెక్షన్లతో మాత్రమే సినిమా ముగిసే అవకాశం ఉంది అని సమాచారం.. మరోపక్క డిసెంబర్ రెండవ వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ప్రసారం కానుందని వెల్లడించారు. కానీ ఈ సినిమాలో చూపించిన ఎవా హాస్పిటల్ పేరును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఈ సినిమా ఓటిటి విడుదల అడ్డుకోవడానికి కోర్టులో కేఫ్ ఫైల్ చేయించారు యాజమాన్యం. దీంతో సమంతా కి కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.. మరి ఈ సినిమా ఓటిటి విడుదలపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.