పుష్ప 2 లో లేడీ విలన్..సుక్కు లెక్క మారిందా?

Satvika
అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప గురించి అందరికి తెలుసు.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది.. అన్నీ రాష్ట్రాల లో మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం తో ఈ మూవీ ప్రేక్షకుల కు తెగ నచ్చేసింది. బన్నీ లుక్ కూడా మంచి టాక్ ను అందుకుంది.

సినిమాకు వారు బ్రహ్మరథం పట్టడం తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ ను ప్రకటించిన సుకుమార్ అండ్ టీమ్, ఇప్పటికే షూటింగ్‌ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.. సీక్వెల్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది. పుష్ప పార్ట్-2 లో ఓ లేడీ విలన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. ఈ పాత్రలో నటించేందు కు ఓ క్రేజీ బ్యూటీని ఎంపిక చేయాలని సుకుమార్ చూస్తున్నాడట.

అయితే బన్నీతో ఇప్పటికే నటించిన హీరోయిన్ అయితే ఈ పాత్రను కంఫర్ట్‌గా చేయగలుగుతుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఈ లేడీ విలన్ పాత్రలో అందాల భామ కేథరిన్ త్రేజా ను సెలెక్ట్ చేసేందుకు పుష్ప టీమ్ ప్లాన్ చేస్తోందట.ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, ఈ సినిమా లో కేథరిన్ నటిస్తే బన్నీ తో ఆమె స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్ల లో టాపులేచిపోద్ది అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో వీరిద్దరు కలిసి నటించగా, ఆ సినిమా లోని పాటల్లో వీరిద్దరి మధ్య అదిరిపోయే కెమిస్ట్రీని అభిమానులు ఎంజాయ్ చేశారు..మరి ఈ సినిమాలో వీరి కాంబినెషన్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: