యూట్యూబర్ వైష్ణవి చైతన్యపై ఎందుకంత కుట్ర.. తొక్కేయాలని చూస్తున్నారా..?

Anilkumar
షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. ఈమె మొదటి సోషల్ మీడియా ద్వారా భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న వైష్ణవి చైతన్య ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.వైష్ణవి చైతన్యకు యూత్లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఇక  ఆమెను చూడగానే తెలుగు అందం ఉట్టిపడే విధంగా చీరకట్టులో ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ యూత్ ని కట్టిపడేస్తూ ఉంటుంది. కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి 

సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది వైష్ణవి చైతన్య.ఈమె టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇక  ఆ తర్వాత వలిమై సినిమాలో కూడా నటించింది. ఒక వైపు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. కానీ ఈమెకు ఒక ఊహించని అవమానం ఎదురయింది.

ఇక  షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే నీకెందుకు హీరోయిన్ వేషం అంటూ కొంతమంది ఆమెను అవమానించారట. అయితే దర్శకుడు సాయి రాజేష్ కు కూడా కొంతమంది ఆ అమ్మాయిని కాకుండా వేరే వాళ్ళని హీరోయిన్ గా తీసుకోమని సలహా ఇచ్చారట.అయితే ముందే ఆ అమ్మాయిని చూసేసారు ఎందుకు తీసుకుంటున్నావు అని రాజేష్ తో చాలామంది అన్నారట.  అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా చేయడం చూసేసాం షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే ఇతర సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రల్లో చూసాము కానీ లోపల ఏదో ఉంటుంది కదా. ఇక తనపై నమ్మకంతో కథ చెబుతున్నప్పుడు తను హీరోయిన్ గా సెట్ అవుతుందని నాకు అనిపించింది రేపు సినిమా చూసినప్పుడు కచ్చితంగా షాక్ అవుతారు అని సాయి రాజేష్ వైష్ణవి చైతన్య పై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు.సాయి రాజేష్ వాక్యలపై స్పందించిన పలువురు నెటిజన్స్ వైష్ణవి చైతన్యను పట్టిక్యులర్ గా వద్దు అనడం ఏంటి? వైష్ణవి చైతన్య పై కుట్ర కాకపోతే ఏమిటి? ఇది తొక్కేయడం కాదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాబీ సినిమాకు సంబంధించిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: