తన భార్య ప్రేగ్నెంట్ వార్తలపై స్పందించిన రానా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్న నటులలో ఒకరు అయినటు వంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుపాటి రానా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం లో తెరకెక్కిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లోని దగ్గుబాటి రానా నటన కు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఆ తరువాత దగ్గుపాటి రానా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అనేక భాష ల సినిమా లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. రానా , రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే దగ్గుపాటి రానా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ తో కలిసి బీమ్లా నాయక్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. భీమ్లా నాయక్ మూవీ కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు.

ఈ మూవీ ద్వారా దగ్గుపాటి రానా క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే రానా కొంత కాలం క్రితమే మిహికా బజాజ్ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. రానా మరియు మిహికా బజాజ్ తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తపై తాజాగా రానా స్పందించాడు. మిహికా బజాజ్ ప్రస్తుతం ప్రేగ్నెంట్ కాదు అని ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని రానా తాజాగా వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: