ఎన్.టి.ఆర్ న్యూ లుక్.. నిరాశలో ఫ్యాన్స్..!

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈమధ్య కొత్త కొత్త లుక్స్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఈమధ్యనే తన న్యూ లుక్ తో సోషల్ మీడియాని షేక్ చేయగా ఇప్పుడు మరో కొత్త లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కోసమే ఈ లుక్ అని తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మొన్న లుక్కు.. ఈరోజు బయటకు వచ్చిన లుక్కు రెండు ఒక కమర్షియల్ యాడ్ కోసమే అని తెలుస్తుంది.
స్టార్ హీరోలంతా కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే ప్రకటనల్లో నెంబర్ 1 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే వినిపిస్తుంది. మహేష్ చేతిలో దాదాపు డజనుకి పైగా బ్రాండ్ లు ఉన్నాయి. ఆ తర్వాత అసలైతే ఎన్.టి.ఆర్ చేతిలోనే ఎక్కువ ఉండాల్సి ఉన్నా ఈమధ్య యాడ్స్ కి దూరంగా ఉన్నాడు తారక్. అందుకే తారక్ చేతిలో ప్రకటనలు తగ్గాయి. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ వరుస యాడ్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో యాడ్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఎన్.టి.ఆర్ లేటెస్ట్ సూట్ లుక్ సినిమా కోసం అనుకున్న నందమూరి ఫ్యాన్స్ కి నిరాశ కలిగింది. తారక్ న్యూ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక తారక్ 30వ సినిమా విషయానికి వస్తే కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా ర్లీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే బాలీవుడ్ భామలు ఒకరిద్దరితో డిస్కషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ 30వ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: