ఇండియాలోని ప్రధాన పట్టణాలలో "అవతార్" మూవీ టికెట్ ధరలు అలా ఉండనున్నాయి..?

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని ప్రపంచవ్యాప్తంగా కురిపించిన సినిమాలలో ఒకటి అయినటువంటి అవతార్ మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవతార్ మూవీ కి జేమ్స్ కెమరన్ దర్శకత్వం వహించాడు. ఇలా అవతార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించి , అద్భుతమైన కలక్షన్ వసూలు చేయడంతో అవతార్ మూవీ కి సీక్వల్ గా జేమ్స్ కామరన్ అవతార్ 2 మూవీ ని రూపొందించాడు. అవతార్ 2 మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే  ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంతరాలు పెట్టుకున్నారు. అలాగే ఇండియా లోని సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క టికెట్ ధరలు ఇండియాలోని ప్రధాన పట్టణాలలో అత్యధికంగా ఎంత ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ : 350 రూపాయలు ... 4DX 3D ఫార్మాట్ .
బెంగుళూర్: 1450 రూపాయలు ... ఐమాక్స్ 3D ఫార్మాట్ .
ముంబై : 970 రూపాయలు ... 4DX 3D ఫార్మాట్ .
పూణే : 1200 రూపాయలు ...4DX 3D ఫార్మాట్ .
ఢిల్లీ - ఏన్ సి ఆర్ ... 1000 రూపాయలు ... ఐమాక్స్ 3D ఫార్మాట్ .
కర్ణాటక : 770 రూపాయలు ... ఐమాక్స్ 3D ఫార్మాట్ .
అహ్మదాబాద్ : 750 రూపాయలు ... 4DX 3D ఫార్మాట్ .
వైజాగ్ : 210 రూపాయలు ... 3D ఫార్మాట్ .
చండీగఢ్ : 450 రూపాయలు ... 4DX 3D ఫార్మాట్ .
ఇండోర్ : 700 రూపాయలు ... 4DX 3D ఫార్మాట్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: