RRR: జపాన్లో వసూళ్ల సునామి?

Purushottham Vinay
ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇటీవల సంచలనం సృష్టించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. జక్కన్న చెక్కిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటించిన ఈ సినిమా పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే ఈ ను జపాన్ దేశంలో లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది.


ఇక జపాన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇక జపాన్ లో కూడా రిలీజ్ చేసే ముందు కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేశారు ఆర్ఆర్ఆర్ టీమ్. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అక్కడి అభిమానులు చరణ్, తారక్ లకు మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ దేశంలోను కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఈమధ్య విడుదలైన ఇండియన్ సినిమాలన్నింటిలో టాప్ మూవీగా ఈ సినిమా నిలిచింది. తాజాగా 2 మిలియన్ వసూళ్లను దాటి తెలుగు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఈమధ్య కాలంలో జపాన్ దేశంలో విడుదలైన సౌత్ సినిమాలన్నింటిలో నెంబర్ వన్ గా నిలవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతోంది మన ఆర్ఆర్ఆర్ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: