బిగ్ బాస్ దివికి మరో బంపర్ ఆఫర్..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో తన అందంతో ఆడియన్స్ ని అలరించిన భామ దివి. అంతకుముందు ఆమె ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలియదు కానీ బిగ్ బాస్ తర్వాత దివి అందరికి పరిచయస్తురాలైంది. ఆ క్రేజ్ తో వెబ్ సీరీస్, సినిమా ఆఫర్లు అందుకుంటున్న దివి ఈమధ్యనె మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో నటించింది. ఇక లేటెస్ట్ గా పాన్ ఇండియా మూవీలో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2లో దివి లక్కీ ఛాన్స్ కొట్టేసిందట.
సినిమాలో ఆమె జర్నలిస్ట్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. దివి వాద్య క్యాబ్ స్టోరీస్ అనే ఓ ప్రవిఏట్ ఆల్బం లో కూడా నటించింది. ఇక మరోపక్క ఓ మూవీ కూడా చేసింది. అయితే పుష్ప 2తో ఛాన్స్ అందుకుంటే మాత్రం అమ్మడి దశ తిరిగినట్టే లెక్క. తప్పకుండా దివికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. పుష్ప 1 ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా పుష్ప 2 కూడా పాన్ ఇండియా లెవల్లో బీభత్సం సృష్టించాలని చూస్తుంది. అలాంటి పుష్ప 2 ప్రాజెక్ట్ లో దివి నటిస్తుంది అంటే ఆమె కూడా సూపర్ పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది.
బిగ్ బాస్ కి ముందు ఆమె అంటే ఎవరికో పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ తర్వాత అమ్మడు అందరికి దగ్గరైంది. తప్పకుండా బిగ్ బాస్ ఆమెకి హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. హౌస్ లో ఉన్న ఐదారు వారే అయినా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన దివి వాద్య తన ఫోటో షూట్స్ తో మాత్రం కుర్రాళ్లని నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో దివి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇదే ఫాం కొనసాగిస్తే అమ్మడికి స్టార్ హీరోల పక్కన కూడా హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: