"ధమాకా" మూవీ నుండి మరో సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రవితేజ "క్రాక్" మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సంవత్సరం మూడవ సినిమా తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా రవితేజ త్రినాథ్ దర్శకత్వం లో శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన ధమాకా అనే రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో రవితేజ హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ కొన్ని పాటలను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ధమాకా మూవీ యూనిట్ మూవీ నుండి "డు డు" అనే సాంగ్ ను నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రవితేజ స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధమాకా మూవీ కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. "డు డు" సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: