రాశి కెరియర్ లో కోలుకోలేని దెబ్బ కొట్టిన నటుడు..ఎవరో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ తార రాశి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ అందాల భామ రాశి.ఇకపోతే ఈమె నటించిన శుభాకాంక్షలు, గోకులంలో సీత వంటి పాత్రలతో హోమ్లీ బ్యూటీ గా కూడా పేరు తెచ్చుకుంది.అయితే  వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన రాశి ఉన్నట్టుండి తన కెరియర్లో డౌన్ అయిపోయింది. ఇక  కెరియర్ పీక్స్ లో ఉండగానే అసోసియేట్ డైరెక్టర్ శ్రీనివాస్ ని ప్రేమించి పెద్దలను ఎదిరించి అతనిని పెళ్లి చేసుకుంది. 

అయితే దాంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.  పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. పెళ్లయ్యాక అన్ని పరిస్థితి బాగుంటాయని భావించింది రాశి. పెళ్లయ్యాక ఆమె కెరియర్ మొత్తం ఆగిపోయింది. తన భర్త నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు.ఆ సినిమాలన్నీ ప్లాప్ అవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ గుర్తింపు రావడం లేదు. రాశి పెళ్లయ్యాక చాలా లావెక్కింది.ఇక  దాంతో ఈమెకు అవకాశాలు కూడా రాలేదు.

అయితే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాశి అనుకోకుండా ఓసారి పవన్ కళ్యాణ్ ని కలిసిందట.  పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓ సలహాతో మణికొండ లో ఒక ప్లే స్కూల్ నడిపించింది.  పవన్ ఇచ్చిన సలహా గొప్పదే కానీ అదృష్టం లేకపోతే ఎవరు ఏం చేయలేం అన్నట్లుగా మారిపోయింది రాశి పరిస్థితి.అయితే ఓ రోజు రాశి స్కూల్లో స్టూడెంట్ గా ఉండే నటుడు శివ బాలాజీ కొడుకు ఒంటిపైన గాయాలతో ఇంటికి రావడంతో రాశి కెరీర్ కి దెబ్బ పడింది. ఎందుకంటే ఇక  శివ బాలాజీ తన కొడుకుని గాయాలతో చూసి రాశి స్కూల్ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. అయితే  స్కూల్ నడపడం చేతకాకపోతే మూసేయండి ఎందుకు ఇలా ఇతరులను వేధించడం అంటూ తిట్టిపోశారు.ఇక  శివ బాలాజీ చేసిన ప్రచారానికి రాశి కెరీర్ ఒక్కసారిగా కింద పడిపోయింది.అయితే  ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక బుల్లితెర మీద ప్రసారమయ్యే ఓ సీరియల్ లో నటిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది రాశిని చూసిన ఆమె అభిమానులు ఒక స్టార్ హీరోయిన్ నుండి ఇలా మారిపోవడం ఏంటి అంటూ చాలా బాధపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: