టాప్ హీరోయిన్స్ పై కన్నేసిన ఆరెక్స్ 100 డైరక్టర్..!

shami
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి ఒక్క సినిమాతో ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా చేశాడు. అయితే తన సెకండ్ సినిమా మహా సముద్రం కోసం ఎంతోమంది హీరోలని కలిసినా లాభం లేకపోవడంతో శర్వానంద్, సిద్ధార్థ్ లతో కలిసి సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి వెరేలా ఉండేది. కానీ సినిమా ఫ్లాప్ అవడం వల్ల అతనికి ఛాన్సులు రాలేదు. ఇక తన 3వ సినిమాగా మరోసారి తనకు హిట్ ఇచ్చిన బోల్డ్ కథతోనే వస్తున్నాడట అజయ్ భూపతి. ఈ సినిమాకు అతను మంగళవార్మ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట.
ఈ సినిమాను అజయ్ సొంత నిర్మాణంలో చేస్తున్నాడని తెలుస్తుంది. తన స్నేహితులు కొందరితో కలిసి అజయ్ భూపతి ఈ మూవీ చేస్తున్నాడని టాక్. మంగళవారం సినిమా ఒక లేడీ ఓరియెంటెడ్ కథ అని తెలుస్తుంది. ఈ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ ని నటింపచేయాలని అనుకుంటున్నారట. అజయ్ భూపతి లిస్ట్ లో సమంత, పూజ హెగ్దే, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. అజయ్ భూపతి తన సినిమాలో ఈ ముగ్గురిలో ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ ముగ్గురు అజయ్ కి ఛాన్స్ ఇస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
సమంత యశోద ఈమధ్యనే రిలీజ్ అవగా.. శాకుంతలం రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదే కాకుండా మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. పూజా హెగ్దే, రష్మిక కూడా అజయ్ ని నమ్మి సినిమా చేసే అవకాశం ఏమాత్రం లేదు. మరి ఈ ముగ్గురిలో ఒకరు కావాలని అనుకుంటున్న అజయ్ వాళ్లని మెప్పిస్తాడా లేక మరో హీరోయిన్ తో సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మహా సముద్రం హిట్ అయితే మాత్రం అజయ్ రేంజ్ వేరేలా ఉండేది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవడం వల్ల అతనికి కెరియర్ కష్టాలు తప్పట్లేదు. అసలు ఇంతకీ ఈ మంగళవారం కథ ఏంటి.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది. కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: