సమ్మర్ లో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే..!!

Satvika
గత రెండు మూడేళ్ల నుంచి కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ మూత పడింది..ఈ మధ్య కాలంలో చిన్న,స్టార్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి.ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది.



కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని తగ్గట్లుగా మార్పులు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ సినిమాల విషయంలో కూడా అంతే .. 6 నెలల సమయం ఉండగానే వేసవిలో విడుదల అయ్యే సినిమాల డేట్లు ఖరారు అయిపోవడం విశేషం.



ముందుగా వేసవి రేస్ లోకి వచ్చిన సలార్, మహేష్- త్రివిక్రమ్ సినిమాలు ముందుగా అనుకున్న టైంలో రిలీజ్ కావటం లేదు. సలార్ ఆల్రెడీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చిత్ర యునిట్‌ ప్రకటించింది. మహేష్- త్రివిక్రమ్ సినిమా కొన్ని అనుకోని కారణాలవల్ల ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. ఈ సినిమా కూడా సమ్మర్ లో విడుదల చేయటం కష్టమే.. ఈ సినిమాలను పక్కన పెడితే మార్చి మూడో వారంలో డీజే టిల్లు2 సినిమాతో వేసవి సినిమాల హడావుడి మొదలవుతుంది. అదే నెల చివర్లో నాని దసరా సినిమా కూడా విడుదల కానుంది.



అత్యంత భారీ సినిమాలలో ప్రధానంగా చూసుకుంటే హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏప్రిల్ లో రాకపోయినా ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేస్తారని తెలుస్తుంది. సమంత -విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఖుషి సినిమాను కూడా షూటింగ్ పూర్తి అయితే సమ్మర్ లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్- బోయపాటి సినిమాని కూడా ఈ సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉందట..ఇంకా చాలా సినిమాలు ఇదే లిస్ట్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: