రజనీకాంత్ "జైలర్" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ ఈ మూవీ లో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన బీస్ట్ మూవీ ఈ సంవత్సరం విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది  ప్రస్తుతం జైలర్ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఎక్కువ శాతం షూటింగ్ ఒకే సెట్ లో జరగనున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ ని 14 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన రజనీ కాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా జైలర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ గ్లిమ్స్ వీడియోకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ , శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన రోబో మూవీ తర్వాత  అంతటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు. మరి జైలర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని సూపర్ స్టార్ రజినీ కాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: