రజనీ కాంత్ "జైలర్" మూవీ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రజనీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తేరకెక్కుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తమిళ , తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాష లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. రజినీ కాంత్ ఈ మూవీ లో హీరో గా నటించడం ,  భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బీస్ట్ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో జైలర్ మూవీ పై ప్రేక్షకుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , శివ కార్తికేయన్ ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో ఒక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ చిన్న వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని సన్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: