ధనుష్ ఎందుకు మారాడు!!

P.Nishanth Kumar
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల చేయడానికి మొదట రంగం సిద్ధం చేశారు. కానీ చివరిగా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ధనుష్ తెలుగులో చేసిన డైరెక్ట్ సినిమా ఇది.

అంతకుముందు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా డబ్బింగ్ సినిమాలు గా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాగా అవి సంచలన విజయాన్ని అందుకున్నాయి. రఘువరన్ బీటెక్ సినిమా ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పలించింది అని చెప్పాలి. అప్పటినుంచి ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలన్న డిమాండ్ ప్రేక్షకులలో నెలకొంది. దానికి తగ్గట్టుగానే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఈ సినిమాను చేయడం జరిగింది.

ఆ విధంగా ఈ సినిమా ను పూర్తి చేసిన ధనుష్ విడుదలకి సిద్ధం చేశాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేయవలసి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఇప్పటికే సార్ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేసిన చిత్ర బృందం దాని ద్వారా మంచి బజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. విద్యావ్యవస్థలోని లోపాల గురించి ఈ సినిమా చేశారని తెలుస్తుంది. మరి ఈ సినిమా తర్వాత ఆయన పెద్ద దర్శకులతో తెలుగు లో సినిమా లు చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే అయన ఎక్కువ తమిళ సినిమాలే చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: