కుర్ర భామల కు ఇదే ఛాన్స్!!

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్ ల కొరత ఏర్పడింది అని చెప్పవచ్చు. కేవలం ఇద్దరు మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్లుగా ఉన్నారు. రష్మిక మందన మరియు  పూజా హెగ్డే. ఈ ఇద్దరు మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన నటించిన కనిపిస్తున్నారు. అయితే వీరిని కూడా ఇప్పుడు హీరో లు పక్కన పెట్టేయడంతో కుర్ర హీరోయిన్లకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.

మహేష్ బాబు సినిమా తప్ప ఏ హీరో సరసన కూడా పూజా హీరోయిన్ గా నటించడం లేదు. పుష్ప 2 సినిమా తప్పితే మరే చిత్రాన్ని కూడా ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు రష్మిక.  దాంతో వీరికి అవకాశాలు ఎప్పుడు వస్తాయో అన్న విషయం పక్కన పెడితే ఈ సమయాన్ని ఉపయోగించుకుని అగ్ర హీరోయిన్ లు ఎదగాలని కొంతమంది సినిమా విశ్లేషకులు కుర్ర హీరోయిన్లకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు హీరోలకు అగ్ర హీరోయిన్లు అయ్యే అవకాశం లేకపోలేదు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయాన్ని అందుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ కృతి శెట్టి అలాగే పెళ్లి సందడి ముద్దుగుమ్మ శ్రీ లీల ఈ ముగ్గురికి కూడా అగ్ర హీరోయిన్లుగా ఎదిగే ఛాన్సులు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం వారు అలాంటి సినిమాలే చేస్తున్నారు. ఈ చిత్రాలు గనక తప్పకుండా  అలారిస్తే వీరికి ఆ చాన్స్ లేకపోలేదు. ఏదేమైనా ఇలాంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకుంటే తప్పకుండా వారు తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగే అవకాశం ఉంది. ఒకవేళ రష్మిక మందన పుష్ప రెండవ భాగం సినిమా విడుదలయితే కనుక ఆమె మళ్లీ సినిమా ఛాన్స్ లు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పూజ హెగ్డే మహేష్ బాబు సినిమా కూడా విజయాన్ని అందుకుంటే ఆమెకు కూడా మంచి అవకాశాలు రావడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: