రాజమౌళి త్వరపడాల్సిందే!!

P.Nishanth Kumar
రాజమౌళి సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. తన సినిమా విషయంలో రాజమౌళి ఎంత క్లారిటీగా ఉంటాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షాట్ ను కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తూ సినిమాను ఒక అద్భుతమైన దృశ్య కావ్యంలా మలుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఎవరికి లేనటువంటి రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆయన చేసిన సినిమాలలో ఏది కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు లేవు.

ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంతో మెప్పించేవే. అన్ని హిట్ సినిమాలను చేసిన ఈ దర్శకుడు ఈ విధమైన రికార్డును అందుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో గర్వపడేలా చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో సినిమా చేయబోతూ ఉండటం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది అని చెప్పాలి. చాలా రోజుల క్రితం నుంచి వీరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు కోరుకున్నారు ఫైనల్ గా ఇప్పుడు అది సాధ్యపడుతూ ఉండడం విశేషం.

వచ్చే ఏడాది ఈ సినిమాను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మహేష్ అభిమానులు తొందరగా ఈ సినిమాను మొదలుపెడితే బాగుంటుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా డైలమా ఉన్న నేపథ్యంలో మహేష్ వెంటనే ఈ చిత్రానికి డేట్స్ కేటాయిస్తాడు. కాబట్టి రాజమౌళి త్వరపడి తొందరగా తన స్క్రిప్ట్ పనులను పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడం ఆయనను మానసికంగా క్రుంగించింది. ఈ నేపథ్యంలో అయన తో సినిమా మొదలు పెట్టాలంటే కొన్ని రోజుల సమయం అయినా పడుతుంది. మరి త్రివిక్రమ్ సినిమా విషయంలో మహేష్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: