చరణ్ వైపు అడుగులు వేస్తున్న బుచ్చిబాబు !

Seetha Sailaja
‘ఉప్పెన’ విడుదల అయిన తరువాత దర్శకుడు బుచ్చిబాబు పేరు మారుమ్రోగిపోయింది. ఎందరో హీరోలు మరెందరో నిర్మాతలు బుచ్చిబాబుతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే బుచ్చిబాబు మాత్రం తాను సినిమా తీస్తే జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే తీస్తాను అని పట్టుపట్టడంతో అతడికి రెండు సంవత్సరాల విలువైన కాలం వృధా అయిపోయింది.

వాస్తవానికి జూనియర్ చేత ద్విపాత్రాభినయం చేయిస్తూ తారక్ ను 60 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిగా ఒకపాత్ర మరొక పాత్రలో 25 సంవత్సరాల యువకుడుగా మరొక పాత్రలో జూనియర్ ను చూపెడుతూ ప్యారా ఒలింపిక్స్ నేపధ్యంలో ఈకథను బుచ్చిబాబు అల్లినట్లు తెలుస్తోంది. ఈకథ జూనియర్ కు చాల బాగా నచ్చడంతో తాను ఆమూవీ చేస్తాను అని మాట ఇవ్వడంతో బుచ్చిబాబు తారక్ ను నమ్ముకున్నాడు.

అయితే ఇప్పుడు కొరటాల జూనియర్ ల మూవీ ప్రారంభం అవ్వడం ఆలస్యం అవ్వడంతో తారక్ ఈ మూవీని పూర్తి చేయడానికి చాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈమూవీ తరువాత జూనియర్ ప్రశాంత్ నీల్ తో ఒక పవర్ ఫుల్ మూవీ చేయవలసి ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి కావడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి అంతకాలం బుచ్చిబాబు ను ఖాళీగా ఉంచలేక మరొక సినిమాను అతనిని చేసుకోమని తారక్ సలహా ఇచ్చినట్లు టాక్.

దీనితో బుచ్చిబాబు తారక్ కోసం తయారుచేసిన కధను చరణ్ దగ్గరకు తీసుకువెళ్ళి అతడి డేట్స్ అడుగుతున్నట్లు టాక్. వాస్తవానికి చరణ్ ప్రస్తుతం శంకర్ తీస్తున్న మూవీ తప్ప మరొక మూవీ ఏది ఒప్పుకొని పరిస్థితులలో బుచ్చిబాబు చెప్పిన కథ తనకు నచ్చినప్పటికీ తనను ప్రేక్షకులు 60 సంవత్సరాలు వయస్సు ఉన్న పాత్రలో నటిస్తే ఎంతవరకు తన అభిమానులు అంగీకరిస్తారు అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బుచ్చిబాబు ను కనీసం చరణ్ అయినా ఆడుకుంటాడ లేదా అన్న కన్ఫ్యూజన్ కొందరిలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: