రౌడీ హీరో చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Satvika
ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక్క సినిమాతో అందరి అభిమానాన్ని పొందారు. లైగర్ ఫెయిల్యూర్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడి, తన నెక్ట్స్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌ లో 'ఖుషి' అనే సినిమా లో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. కాగా, తాజాగా విజయ్ దేవరకొండ ఓ ప్రకటన చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.

పేస్ ఆస్పత్రి నిర్వహించిన లీవర్ ట్రాన్స్‌ ప్లాంటేషన్ అవగాహన సదస్సు కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమం లో పేస్ ఆసుపత్రి తో తనకున్న రిలేషన్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో తాను సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నప్పుడు తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఆ సమయం లో పేస్ ఆసుపత్రి వారు ఆయనకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన్ను కాపాడారని.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం గా ఉన్నారంటే అది పేస్ ఆసుపత్రి వల్లే అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇక తన అవయవాల ను దానం చేస్తున్నట్లు ఈ సందర్భంగా విజయ్ తెలిపాడు..

తన అవయవాలు వేరొకరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయంటే, తనకంటే సంతోషించేవారు ఉండరని విజయ్ తెలిపాడు. ఇలా విజయ్ తన ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించడం తో నెట్టింట ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మంచి పనులు చేయాలని అభిమాను లు  కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈ వార్త వైరల్ అవుతుంది.. కనీసం ఖుషి సినిమా అయిన హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: