ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ స్థానంలో నిలిచిన ప్రబాస్..?

Pulgam Srinivas
ఆర్మాక్ మీడియా సంస్థ ప్రస్తుతం సినీ తారలపై మరియు క్రీడాకారులపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ మీడియా సంస్థ అక్టోబర్ నెలకు సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అత్యంత ప్రజాదరణ పొందిన మెయిల్ స్టార్స్ పై ఒక సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో పది స్థానాలలో నిలిచిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.
 

ఆమ్యాక్స్ మీడియా సంస్థ తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి నిర్వహించిన తెలుగు మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ సంబంధించిన సర్వేలో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఆ తర్వాత రెండవ స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. మూడవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. నాలుగవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచాడు.  ఐదవ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఆరవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

నాచురల్ స్టార్ నాని ఈ సర్వేలో ఏడవ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం నాని దసరా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు  విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. తొమ్మిదవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పదవ స్థానం లో విక్టరీ వెంకటేష్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: