వర్మకు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్ !

Seetha Sailaja
ప్రభాస్ రామ్ గోపాల్ వర్మ ది ఒకే సామాజిక వర్గం కావడమే కాకుండా వీరిద్దరూ భీమవరానికి చెందిన వ్యక్తులు. వీరిద్దరికీ పెద్దగా పరిచయం ఉన్నట్లు ఎక్కడా కనిపించరు. వర్మ టాప్ హీరోలందరిని టార్గెట్ చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు ప్రభాస్ జోలికి వచ్చిన సందర్భాలు కనిపించవు. ఇప్పుడు అనుకోకుండా ప్రభాస్ నటిస్తున్న ఒక భారీ సినిమాలో రామ్ గోపాల్ వర్మకు అవకాశం వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో వర్మ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈమూవీలో వర్మ సినిమా దర్శకుడుగానే కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే నాగ్ అశ్విన్ వర్మను కలిసి అతడి పాత్రకు సంబంధించిన వివరాలను తెలియచేసాడనీ ప్రభాస్ పక్కన నటించే విషయంలో వర్మ కూడ ఆశక్తి కనపరిచాడు అని అంటున్నారు.

ఒకప్పుడు ట్రెండ్ సెటర్ గా నిలిచిన వర్మ ప్రస్తుతం అతడు తీస్తున్న సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడ తెలియని పరిస్థితులలో ప్రేక్షకులు పట్టించుకోలేని స్థితికి చేరిపోయాడు. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపధ్యంలో వర్మ ఒక పొలిటికల్ మూవీని తీయబోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో వర్మకు ప్రభాస్ సినిమాలో నటించడం ఒకవిధంగా టర్నింగ్ పాయింట్ అని అనుకోవాలి.

ఈమధ్య విడుదలైన ‘గాడ్ ఫాదర్’ మూవీలో పూరీజగన్నాథ్ ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వర్మ కూడ ప్రభాస్ సినిమాలో నటించి మెప్పించగలిగితే ఫెయిల్యూర్ దర్శకులుగా మారిన ఒకప్పటి టాప్ దర్శకులు నటులుగా మారే సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రభాస్ పక్కన వర్మ నటించే సమయంలో ఏదైనా కథ చెప్పి వర్మ ప్రభాస్ ను బుట్టలో పెట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు. మారుతి లాంటి ఫెయిల్యూర్ దర్శకుడుకి కూడ ధైర్యంగా అవకాశాలు ఇచ్చిన ప్రభాస్ రానున్న రోజులలో వర్మ కు ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ అతడి దశ తిరిగి టాప్ దర్శకుడుగా మళ్ళీ మారే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: