టాలీవుడ్లో విషాదం సూపర్ స్టార్ కృష్ణ మృతి..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. నటనపరంగా టెక్నాలజీ పరంగా సినీ ఇండస్ట్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకోవచ్చారు కృష్ణ. ఇక ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందించారు. కృష్ణ నిన్నటి రోజున స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాదులో ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకెళ్లారు.. అక్కడ వైద్యానికి కృష్ణ శరీరం సహకరించకపోవడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయానికి కన్ను మూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం తెలియగానే అటు అభిమానులలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దీంతో అటు అభిమానులు,  మహేష్ బాబు కుటుంబం , సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. ఇక తన తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకొని నిన్నటి రోజున మహేష్ బాబు హుటాహుటిగా హైదరాబాద్ కి బయలుదేరి రావడం జరిగింది. ఇక అక్కడే హాస్పిటల్ లో ఉండి తన తండ్రి బాగోగులను చూసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఊపిరితిత్తులతో సహా అన్ని భాగాలు పనిచేయడం మానేశాయని.. మందులు కూడా ఆయన శరీరానికి సహకరించలేదని .. స్పృహలోకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేక తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూసినట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఒకేసారి కృష్ణ కుటుంబంలోఈ ఏడాది మూడో మరణం ఇది. జనవరి 2022లో ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందగా సెప్టెంబర్ నెలలో న కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి కూడా మరణించింది.  ఇక ఈ రోజున కృష్ణ కన్నుమూయడం జరిగింది.  దీంతో ఘట్టమనేని అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సందర్శనార్థం పలువురు సెలబ్రిటీలు సినీ ప్రేమికులు ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా ఆయన పార్తివదేహాన్ని సందర్శించడానికి బయలుదేరుతున్నట్లు సమాచారం ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులకు కూడా తమ సంతాపాన్ని ట్వీట్ ల ద్వారా షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: