ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పై జక్కన్న ఏమన్నారో తెలుసా?

Satvika
బాహుబలి తర్వాత అంతకు మించి ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమా ట్రిపుల్ ఆర్.. రాజమౌలి సినిమాల గురించి ప్రత్యెకం గా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయి లో కలెక్షన్స్ ను సాధించింది. బాలీవుడ్ లోనూ మన సత్తా చాటింది. ఇక విదేశాల్లో అయితే ఆర్ఆర్ఆర్ ను ఎగబడి చూశారు జనాలు.

 రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ఈ అక్కడ కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అక్కడి టాప్ సినిమా ల్లో ఒకటిగా నిలిచింది ఆర్ఆర్ఆర్. ఒక ఆర్ఆర్ఆర్ ఈ సినిమా లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. తారక్ కొమురం భీమ్ గా చరణ్ అల్లూరి సీతా రామరాజుగా అద్భుతంగా నటించారు. కాగా, ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కు సంబంధించి న ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే బాహుబలి రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను కూడా రెండు భాగాలు గా తీసుకురావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నా చిత్రాలన్నింటి కీ మా నాన్నే కథలు రాస్తారు. ఆర్ఆర్ఆర్-2 గురించి ఇటీవల కొద్దిగా చర్చించాం. ఇప్పుడాయన ఆ స్టోరీ పై కసరత్తులు చేస్తున్నార ని చెప్పుకొచ్చారు. దాంతో ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.. ఆ సినిమాను జక్కన్న ఎలా చేస్తారో చూడాలి.. ప్రస్తుతం ఈ సినిమా జపాన్ లో భారీ సక్సెస్ ను అందుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: