27 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను సాధించిన "కాంతారా" మూవీ..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి రిషబ్ శెట్టి తాజాగా కాంతారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మొదట సెప్టెంబర్ 30 వ తేదీన కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల అయింది. ఈ మూవీ కి కన్నడ భాషలో అద్భుతమైన టాక్ లభించడంతో , ఈ మూవీకి అద్భుతమైన కలెక్షన్ లు కన్నడ భాషలో దక్కాయి.  ఆ తర్వాత ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేశారు.

తెలుగు లో ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశాడు.  తెలుగు భాషలో కూడా ఈ మూవీ కి అద్భుతమైన టాక్ లభించడంతో , ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు తెలుపు భాష నుండి వస్తున్నాయి  ఇప్పటి వరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ మూవీ 27 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 12.41 కోట్లు .
సీడెడ్ : 3.07 కోట్లు .
యు ఏ : 3.51 కోట్లు .
ఈస్ట్ : 2.04 కోట్లు .
వెస్ట్ : 1.27 కోట్లు .
గుంటూర్ : 1.67 కోట్లు .
కృష్ణ : 1.63 కోట్లు .
నెల్లూర్ : 95 లక్షలు .
27 రోజులకు కాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతారా మూవీ 26.55 కోట్ల షేర్ , 50.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా కాంతారా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: