ఎన్టీఆర్ 30 మరియు 31 మూవీలకు ఆ ఇద్దరు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్లు..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని  అందుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్టార్ట్ కాక ముందే ఈ మూవీ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బుస్రుర్ సంగీతం అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ లైన్ అప్ లో ఉన్న ఈ రెండు సినిమా లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: