"అవతార్ 2" మూవీ కనుక ఫ్లాప్ అయితే ... క్లారిటీ ఇచ్చిన జేమ్స్ కామెరన్..!

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాలను సాధించిన మూవీ లలో ఒకటిగా నిలిచిన అవతార్ మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అత్యంత భారీ బడ్జెట్ తో ,  అత్యంత భారీ "వి ఎఫ్ ఎక్స్" ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన అవతార్ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి అద్భుతమైన భారీ  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. అవతార్ మూవీ కి జామ్స్ కామరన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే అవతార్  1 మూవీ అద్భుతమైన విజయం సాధించి , అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కమరున్ అవతార్ మూవీ కి పార్ట్ 2 ను అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ చిత్రీకరణ కూడా పూర్తి అయింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీని డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జేమ్స్ కెమరన్ "అవతార్ ది వే ఆఫ్ వాటర్" మూవీ పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ విజయం సాధించనట్లు అయితే అవతార్ 3 తోనే ఈ సిరీస్ ను ముగిస్తాను అని తాజాగా ఈ మూవీ దర్శకుడు జేమ్స్ కామరన్ ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: