అల్లు అర్జున్ రామ్ చరణ్ ల వైపు పరుగులుతీస్తున్న దర్శకులు !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో రామ్ చరణ్ ‘పుష్ప’ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవడంతో వారితో సినిమాలు తీయాలని ఈమధ్యనే ‘బింబిసార’ మూవీతో సూపర్ హిట్ కొట్టిన మల్లిడి వశిష్ట నుండి అనేకమంది యంగ్ డైరెక్టర్స్ చరణ్ బన్నీల కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్ శంకర్ తో సినిమాను చేస్తున్నాడు. అదేవిధంగా బన్నీ ‘పుష్ప 2’ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈరెండు సినిమాలు వీరిద్దరూ మరే సినిమాకి కమిట్ అవ్వకపోవడంతో ఏదోవిధంగా వీరిద్దరిలో ఎవరో ఒకర్ని తమ కథతో మెప్పించాలని అనేకమంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలలో వీరిద్దరూ తప్ప ప్రభాస్ మహేష్ జూనియర్ లు వారివారి సినిమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ త్రివిక్రమ్ తో సినిమాను పూర్తి చేసుకున్న వెంటనే రాజమౌళి వైపు వెళ్ళిపోతాడు.

జూనియర్ కొరటాల శివతో చేయవలసిన మూవీని పూర్తి చేసి దర్శకుడు ప్రశాంత్ నీల్ వైపు వెళ్ళవలసి ఉంది. ఇక ప్రభాస్ అయితే వరసపెట్టి నాలుగు సినిమాలు చేస్తూ ఒక్కక్షణం ఖాళీ లేకుండా ఉంటున్నాడు. దీనితో ప్రస్తుతం కొంతమేరకు ఖాళీ ఉన్న రామ్ చరణ్ బన్నీ లపైనే యంగ్ డైరెక్టర్స్ దృష్టి పడుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ బన్నీలు యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలు వింటున్నారు కానీ వారు ఇప్పటివరకు ఎవరి కథకు ఒకే చెప్పినట్లు తెలియడంలేదు.

అయినప్పటికీ చాలామంది యంగ్ డైరెక్టర్స్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ చరణ్ బన్నీలకు కథలు చెపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ డేట్స్ ఇస్తే చాలు వీరితో సినిమాలు చేయడానికి అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నప్పటికీ చరణ్ అల్లు అర్జున్ లు ఆడుతున్న సేఫ్ గేమ్ తో చాలమంది యంగ్ డైరెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి మీడియం రేంజ్ హీరోలు రెడీగా ఉన్నప్పటికీ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ దృష్టి అంతా చరణ్ బన్నీ లపైనే ఉండటం ఇక్కడి ట్విస్ట్..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: