మహేష్... త్రివిక్రమ్ మూవీలో ఆ యంగ్ బ్యూటీ..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తనకేక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా , మోస్ట్ గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే ఈ మూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది.

ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు ,  అందులో భాగంగా మహేష్ బాబు మరియు పూజా హెగ్డే లపై పెళ్లి సీన్ లను తెరకేక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు , ఆ పాత్ర ఈ మూవీ లో తక్కువ సమయమే కనిపించినప్పటికీ , సినిమాపై చాలా ఎక్కువ ప్రభావం చూపించే పాత్ర అని తెలుస్తుంది. 

ఆ పాత్రలో గీతిక అనే యువ హీరోయిన్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. గీతిక , తేజ దర్శకత్వంలో దగ్గుపాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన అహింస మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కాకముందే గీతిక కు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ లో అవకాశం దక్కినట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: