100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయినా "సర్దార్" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ కొంత కాలం క్రితమే మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ తమిళ్ , తెలుగు , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో కార్తీ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కార్తీ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో కార్తీ స్పై ఏజెంట్ గా నటించగా ,  మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ మూవీ లో రాజేషి విజయన్ ,  రాసి కన్నా ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా , జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ మరియు తెలుగు భాషలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ మరియు తెలుగు భాషల్లో మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు భాషల్లో కూడా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కలెక్షన్ లకు సంబంధించిన ఒక ప్రకటన చేసింది. సర్దార్ మూవీ యూనిట్ తాజాగా సర్దార్ మూవీ 100 ప్లస్ కోట్ల కలెక్షన్ లను సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సర్దార్ పార్ట్ 2 మూవీ ని కూడా తెరకెక్కించనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: