నాకు అలాంటివి అంటే అసహ్యం.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ పోతూ ఉన్న.. అటు ఇండస్ట్రీ లోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులందరికీ తన అందం అభినయంతో కట్టిపడేసిన సాయి పల్లవికి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అవకాశాల కోసం హీరోయిన్లు అందరూ కూడా అందాల ఆరబోత చేస్తున్న సమయంలో సాయి పల్లవి మాత్రం  గ్లామర్ షో కి దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోతుంది.

 ఇలా అయితే అవకాశాలు రావడం కష్టమే అని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం తనకు ఇష్టం లేని పని ఎప్పటికీ చేయబోను అంటూ చెప్పి ఏకంగా అభిమానులను గర్వపడేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ అదరగొడుతుంది. అయితే సాయి పల్లవి నటనలోనే కాదు డాన్స్ లో కూడా తనకు ఎవరూ తిరుగులేదు అని నిరూపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఆమె బాడీలో ఏమైనా స్ప్రింగ్ లు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ.

 ఇప్పటికే మంచి డాన్సర్ గా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి డాన్స్ రియాలిటీ షో ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఒక టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. టెలివిజన్ ఛానల్స్ ఎప్పుడు కొంతమందికే ప్రాధాన్యత ఇస్తారు.  ప్రముఖుల వారసులకే మర్యాదలు గౌరవాలు అన్ని దక్కుతాయి. డబ్బు ఉంటేనే టాలెంట్ ఉన్నవారికి ఇక్కడ గుర్తింపు లభిస్తుంది. అందుకే నాకు డాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదు. ఒక రకంగా చెప్పాలంటే డాన్స్ పోటీలు అంటేనే నాకు ఎంతో అసహ్యం అంటూ సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా గతంలో డాన్స్ రియాలిటీ షో ఢీ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సాయి పల్లవి రన్నరప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: