అరుదైన వ్యాధితో బాధపడుతున్న జాతి రత్నాలు దర్శకుడు..!

Divya
జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచిన దర్శకుడు అనుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట పిట్టగోడ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ అనుదీప్. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సుమా హోస్టుగా వ్యవహరిస్తున్న క్యాష్ షోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా తమిళ్ హీరో శివ కార్తికేయన్ తాజాగా నటించిన ప్రిన్స్ సినిమాకి కూడా అనుదీప్ దర్శకత్వం వహించడం విశేషం.

కానీ ఈ సినిమా జాతి రత్నాలు సినిమా అంత విజయం సాధించలేదు.  కానీ సినిమా మాత్రం హిట్ టాక్  సొంతం చేసుకుంది . తమిళంలో ఈ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తనలో ఉన్న మరో కోణాన్ని పరిచయం చేశారు అనుదీప్.. ముఖ్యంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుదీప్ తనకున్న ఒక వ్యాధి గురించి చెప్పుకొచ్చారు. HSP అనే డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు.  ఏ ఒక్కరిలో ఈ డిజాస్టర్ లక్షణాలు ఉంటాయో వారు అర్థం చేసుకోలేరు అని కూడా తెలిపాడు. చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో తాను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నట్లు కూడా తెలిపాడు.
గ్లూటెన్ పడదని, కాఫీ తాగితే రెండు రోజులపాటు నిద్ర రాదని , ఏదైనా పళ్ళ రసం తాగితే మైండ్ కం అవుతుందని తెలిపాడు.  ఈ డిజాస్టర్ ఉన్నవారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్ పనిచేస్తాయని,  ఎక్కువ కాంతివంతమైన లైట్స్ చూసినా.. ఘాటైన వాసనలు చూసిన తట్టుకోలేరని త్వరగా అలసిపోతారని కూడా చెప్పుకొచ్చాడు అనుదీప్ . అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు చెప్పలేదు అని కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని కూడా చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.  మొత్తానికైతే అనుదీప్ కి వచ్చిన వ్యాధి గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. మరి ఈయన ఎందుకు చికిత్స తీసుకోవడం లేదు..లేదా చికిత్స తీసుకున్న తర్వాత కూడా జబ్బు నయం కాలేదా అన్న అనుమానాలు అభిమానులలో వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: