త్రిష కి ఇంకా అవకాశాలు వస్తున్నాయా!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఉంది త్రిష. ఎన్నో మరపురాని విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంకా సినిమా అవకాశాలను అందుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. 25 సంవత్సరాల దాటుతున్న కూడా ఇంకా సినిమా అవకాశాలు రావడం విశేషం ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాల జాబితా యువ హీరోయిన్ ల కంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. తెలుగులో దాదాపు అందరి హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలోనే సినిమాలు చేయడం జరుగుతుంది.

అక్కడే ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కారణం ఏదైనా కూడా ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం లేదు అన్నది అసలు విషయం. 2016వ సంవత్సరంలో నాయకి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత తెలుగులో ఇప్పటి దాకా ఒక సినిమా చేయలేదు. ఏడు సంవత్సరాలు దాటుతున్న కూడా ఏ తెలుగు దర్శకుడు ఆమె కు తగ్గ కథను వివరించక పోవడం నిజంగా ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

 ఇంకొక వైపు తమిళ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలను చేసుకుంటూ పోతూ ఉంది. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా యొక్క రెండవ భాగంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరి కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లో నటిస్తూ అక్కడ తనకు తిరుగు లేదు అన్నట్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో త్రిష ఇంకెన్ని రోజులు నటిగా కొనసాగుతుందో చూడాలి. తెలుగులో ఈ ముద్దుగుమ్మ తో సినిమా చేయాలని కొంతమంది ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా పరవాలేదు అనే విధంగా వారు మన తెలుగు దర్శక నిర్మాతలకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అయితే త్వరలోనే ఆమెతో తెలుగు లో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ చిత్రం ఎంతవరకు నిజమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: