సమంత లాగే భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్స్..??

Anilkumar
బయటకు సంతోషంగా అందంగా కనిపించే హీరోయిన్స్ తమ జీవితాలలో చెప్పుకోలేని ఇబ్బందులతో మరింతగా సతమతమవుతున్నారు.ఇక మానసికంగా, శారీరకంగా వారికుండే కష్టాలు అనేకం.. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది.ఇక  ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో కూడా చెప్పలేని పరిస్థితి.కాగా  ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఈమధ్య కాలంలో మానసిక శారీరక రుగ్మతలకు గురి అవుతున్నారు.

సమంత:
లేడీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆటో ఇమ్యూన్ కారణంగా మయోసిటీస్ బారిన పడ్డారు.ఇక ఇది కండరాలకు సంబంధించిన వ్యాధి.. ప్రస్తుతం ఈ వ్యాధికి లేడీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత  చికిత్స తీసుకుంటున్నారు.అంతేకాదు గతంలో కూడా సమంత చర్మ సంబంధ సమస్యలతో బాధపడిన విషయం తెలిసిందే.
నయనతార:
ఈమె సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఒక దశలో తీవ్రమైన స్కిన్ ఎలర్జీ సమస్యతో బాధపడ్డారు.ఇక  మేకప్ కారణంగా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార కు ఈ వ్యాధి సోకింది . ఇకపోతే చికిత్స తర్వాత ప్రస్తుతం ఆమె తిరిగి కోలుకున్నారు.

దీపికా పదుకునే:
దీపికా పదుకొనే  చాలాకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక రన్బీర్ కపూర్ తో లవ్ బ్రేకప్ కారణంగా డిప్రెషన్ కి గురయ్యారు.అయితే  ఇప్పటికీ ఆమె చికిత్స తీసుకుంటున్నారు.. కానీ ఇంకా బయటపడలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలియానా:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా చాలా కాలం బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్ తో బాధపడ్డారు.ఇక  ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజాస్టర్ వచ్చినవారు తమ శరీరం , అందం గురించి బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఇక తాము అందంగా లేమని ఆందోళన చెందుతూ ఉంటారు.
స్నేహ ఉల్లాల్:
ఈమె ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. కొన్నాళ్లు ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన స్నేహ ఉల్లాల్ చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: