బాలయ్య జోన్ లో కుమ్మేసిన చిరు...!!

murali krishna
రెండు పెద్ద సినిమాలు ఒకేసారి బరిలో దిగుతున్నప్పుడు ఖచ్చితంగా పోటీ, పోలిక ఉంటుది. అందులోనూ ఒకే బ్యానర్ ఆ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తే మరీ ఎక్కువగా ఉంటుందట.
ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విషయంలో అదే జరుగుతోంది.
రీసెంట్ గా "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయట.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.
మరో ప్రక్క నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ప్రేక్షకులందరికీ రాబోతున్న "వీర సింహారెడ్డి" సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. రెండు సినిమాలను మైత్రీ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి విజేతగా నిలుస్తుంది అనేది ప్రక్కన పెడితే...రెండు సినిమాలకు జరుగుతున్న బిజినెస్ లెక్కలంటూ కొన్ని ఫిగర్స్ మీడియాలో ప్రత్యక్ష్యమవుతున్నాయి. అవన్నీ బాలయ్య సినిమాకు బిజినెస్ తక్కువ చేసి చూపెడుతూ మెగాస్టార్ ని మరో మెట్టు ఎక్కిస్తున్నాయట.వాటిలో నిజమెంత అనేది క్లారిటీగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అవి అఫీషియల్ లెక్కలు కాదు. అయితే ఆ లెక్కలు ప్రకారం
సీడెడ్ ఏరియాలో
వాల్తేరు వీరయ్య - 15 కోట్లు
వీరసింహా రెడ్డి- 13 కోట్లు
సీడెడ్ ఏరియా బాలయ్య కు స్ట్రాంగ్ గా చాలా కాలంగా నిలుస్తోంది. వాస్తవానికి అక్కడ చిరంజీవి సినిమాని మించి బిజినెస్ జరగాలి. కాని సీన్ రివర్స్ అయ్యిందని తెలుస్తుంది.
గుంటూరు ఏరియా రైట్స్ విషయానికి వస్తే..
వాల్తేరు వీరయ్య - 9CR
వీరసింహా రెడ్డి - 7CR
USA రైట్స్ ..
వాల్తేరు వీరయ్య- 7.5CR (Sold)
వీరసింహా రెడ్డి - 4CR (Sold)
ఇక "గాడ్ ఫాదర్" సినిమా హిట్ అవ్వడంతో వాల్తేరు వీరయ్య సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమా రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయట.ఇప్పటికే దీని తాలూకా సగం పేమెంట్ అయిపోయిందని పూర్తి పేమెంట్ అయిపోగానే చిత్ర రైట్స్ నెట్ ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయని సమాచారం. అయితే ఒకవేళ సినిమా విడుదలైన మూడు వారాలకి ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు పర్మిషన్ ఇస్తే నెట్ఫ్లిక్స్ వారు మరికొంత ఎక్కువ అమౌంట్ ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. మరి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు దీనికి ఒప్పుకుంటారో లేదో మరి వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: