వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సురేష్ ప్రొడక్షన్స్...!!

murali krishna
సురేష్ ప్రొడక్షన్స్.. తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు. అలాగని మిగతా చిత్ర పరిశ్రమలకు తెలియదని కాదు. తెలుగు, తమిళ్, హిందీ, బెంగాలీ..
ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు తీసి ఆ ప్రొడక్షన్స్ ఓనర్ రామానాయుడు మూవీ మొగల్ అనిపించుకున్నాడు. ఆయన గతించాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు కూడా అలాగే గతిస్తున్నాయి. ఈ పదం వాడేందుకు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు.. ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేయడం అంటే అంత సులభమైన విషయం అయితే కాదు. నిర్మాత రామానాయుడు కథలు విని.. అది వర్కౌట్ అవుతుందో లేదో వెంటనే చెప్పేసేవారు.. అలాగని ఆయన లెక్కలు తప్ప లేదని కాదు.. కానీ చాలా తక్కువ.. బొబ్బిలి రాజా సినిమా నుంచి భారీ చిత్రాల నిర్మాణ బాధ్యతలు సురేష్ బాబు చేతికి వచ్చాయి.. ఓ పక్క డిస్ట్రిబ్యూషన్ తో పాటు సినిమా నిర్మాణం కూడా సురేష్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. ఈ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారట... ఈమధ్య సురేష్ బాబు లెక్క పూర్తిగా తప్పుతున్నది. కథలను సరిగ్గా విని ఓకే చేస్తున్నారా లేదో మరి ఇంకేదైనా కారణమేమో కానీ.. ఈ బ్యానర్ లో వస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి అనుదీప్. మల్టీ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్.. ఊర మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్ థమన్.. ఈ ముగ్గురూ కలిసి తీసిన ప్రిన్స్ సినిమా ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ హౌస్ నుంచి విడుదలైంది. కానీ ఇది బ్లాక్ దిశగా పరుగులు పెడుతోంది. తమిళంలో ఒక మోస్తరుగా ఆడుతోంది. మున్నా మధ్య శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త ఇలా చాలా సినిమాలే వచ్చాయి.. కానీ ఇవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.. అంతకుముందు రానా, సాయి పల్లవి కాంబినేషన్లో విడుదలైన విరాటపర్వం సినిమా కూడా థియేటర్లో అంతగా ఆడలేదు.. ఓటిటికి అనుకున్న ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసి కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయారట .. వెంకటేష్, మీనా కాంబినేషన్లో నిర్మించిన దృశ్యం 2 చిత్రాన్ని మాత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. వాస్తవానికి దృశ్యం మొదటి భాగం తెలుగులో విజయవంతమైంది. రెండో భాగం సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం నిర్మాతలు నేరుగా ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.. ఇలా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన సినిమాలు థియేటర్లో.. థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి.
అయితే పై సినిమాలు సురేష్ బాబు సోలోగా నిర్మించిన సినిమాలు కాదు.. అయినప్పటికీ సురేష్ ప్రొడక్షన్స్ లోగో చూసినప్పుడు జనాలు ఆ బ్యానర్ సినిమా అని అనుకుంటారు.. భవిష్యత్తులో అయినా సురేష్ బాబు హిట్స్ అందుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటారేమో చూడాలి.. ప్రస్తుతం సురేష్ బాబు తన రెండో కొడుకు హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారు.. అది షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందట..
 

ఇక పెద్దపెద్ద ప్రాజెక్టులు ఏవీ లైన్ లో పెట్టని సురేష్ ప్రొడక్షన్స్… ఇప్పుడు ప్లాపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.. అయితే రామానాయుడు ఫిలిం స్కూల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలని సురేష్ బాబు అనుకున్నట్టు తెలిసింది. తక్కువలో తక్కువ రెండు కోట్ల బడ్జెట్ లోపు సినిమా పూర్తి చేసి… వాటి ద్వారా లాభాలు గడించాలని సురేష్ బాబు అనుకుంటున్నారు.. ఇది ఎంతవరకు ప్రతిఫలాన్ని ఇస్తుందో మరీ వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: