కియారా రాంగ్ ఛాయిస్.. ఆమెను గట్టెక్కించేనా!!

P.Nishanth Kumar

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవరైనా హీరోయిన్ లుగా నిలదొక్కుకోవాలన్నా అగ్ర హీరోయిన్లుగా ఎదగాలన్న వారికి తప్పకుండా భారీ విజయాలు తప్పనిసరి అవసరం అవుతాయి. పెద్ద హీరోల సరసన సినిమా అవకాశాలు అందుకోవాలి అంటే వారికి మంచి క్రేజ్ ఉండాలి. అప్పుడే వారికి పెద్ద సినిమా అవకాశాలు వస్తాయి. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలోకి రావడమే ఒక భారీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ కథానాయక కియారా అద్వానీ

ఆమె బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించగా తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అను నేను అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంతోనే ఇంతటి స్టార్ హోదా కలిగిన హీరోతో కలిసిన నటించడం నిజంగా ఆమె అదృష్టం అని చెప్పాలి. దానికి తోడు ఆమె అందం అభినయం పరంగా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు క్యు లు కట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన రెండవ సినిమా తోనే డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు కొన్ని రోజులు చేసి ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటుంది.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా అవకాశం అందుకోగా ఆమెకు వచ్చిన మరొక మంచి అవకాశాన్ని చేజార్చుకోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో మొదటగా హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మనే అనుకున్నారు కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఫైనల్ గా ఆమె స్థానంలో సమంత ను ఎంపిక చేశారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా చాలా బాగా వచ్చింది అని తప్పకుండా భారీ విజయాన్ని ఈ సినిమా తీసుకువస్తుందని చెబుతున్నారు. దీన్ని బట్టి కియారా ఓ హిట్ సినిమా ను కోల్పోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: