ప్రతి రోజు పడక సుఖం కావాలంటున్న పృద్వి...!!

murali krishna
పెళ్లి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు నటుడు పృధ్విరాజ్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి పందిరి, పెళ్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళీభవ వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత గా దగ్గరయ్యారు.
నటుడు పృథ్వీరాజ్ తెలుగులో దాదాపు 40 సినిమాల్లో నటించాడు. ఇక రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో వరుస సినిమాలు చేశారు. ఇక ఈయన తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషలు అన్నీ కలుపుకొని వందకు పైగా సినిమాల్లో నటించారు. ఈయన సినిమాల్లోనే కాకుండా స్టార్ మా లో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ లో కూడా ఆయన నటించారు.
ఇక ఈ విషయం పక్కన పెడితే..నటుడు పృథ్వీరాజ్ ఈ మధ్యకాలంలో 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన వయసు 57 సంవత్సరాలు కావడంతో ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ..అవును నేను ఆ అమ్మాయితో సహజీవనం చేస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుంటాను. పిల్లల్ని కూడా కంటాను అని బహిరంగంగానే ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ నటుడి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అదికూడా ఆయన చెప్పిన ఓ బోల్డ్ ఆన్సర్. పృథ్వీరాజ్ ఓ తమిళ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు బోల్డ్ ప్రశ్న ఎదురయింది. యాంకర్ మాట్లాడుతూ.. మీకు ప్రతిరోజు పడక సుఖం కావాలా? అంటూ ప్రశ్నించిందట.
దానికి పృధ్విరాజ్ మాట్లాడుతూ.. అవును నేను చాలా ఫీట్ గా ఉన్నాను.. అంటూ బాడీ లాంగ్వేజ్ గురించి చెబుతూనే నాకు ప్రతిరోజు పడక సుఖం కావాలి అనిపిస్తుంది అంటూ బోల్డ్ ఆన్సర్  కూడా ఇచ్చాడు. అయితే యాంకర్ ఆయన దగ్గర్నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని ఊహించలేదు. దాంతో ఆయన చెప్పిన ఆన్సర్ కి ఒక్కసారి గా యాంకర్ నోరేళ్లబెట్టింది. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజెన్స్ అయితే మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఎందుకు నోరేళ్లబెట్టడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. నటుడు పృధ్విరాజ్ ప్రస్తుతం తన మొదటి భార్య బీనాకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు ఆ అమ్మాయితో రెండో బిడ్డను కూడా కనడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన ఓపెన్ గానే చెప్పాడు. ప్రస్తుతం పృధ్విరాజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: