బిగ్ బాస్ 6 లో గీతూ ,ఇనాయా ల మధ్య ఎమ్ జరిగింది..!!

murali krishna
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో రాయలసీమ అమ్మాయి గీతూ రాయల్‌ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆమె టాస్క్ ల విషయంలో పెద్ద గా యాక్టివ్‌ గా ఉన్న సందర్భాలు చాలా తక్కువే అయినా ఫిజికల్‌ గా కాకుండా మెంటల్ గా ఆమె బాగా ఆడుతుంది.
ఇక ఇనాయా సుల్తానా గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పు కోవాలి. ఈమె మొదటి రెండు మూడు వారాల్లోనే వెళ్తుందని అంతా భావించారు. ఒక వైపు వర్మ నుండి వస్తున్న మద్దతు మరియు మరో వైపు ఆమె ఆట తీరు మెరుగు పడటం వల్ల మంచి ఓట్లు పడుతున్నాయి ఈమెకు.
తెలుగు బిగ్ బాస్ లో వీరిద్దరు కీలకం అనుకుంటున్న సమయం లో వీరి ఇద్దరి యొక్క ప్రవర్తన విమర్శల పాలు అవుతుంది అంటూ కామెంట్స్  బాగానే వస్తున్నాయి. ముఖ్యం గా గీతూ రాయల్‌ మాట తీరు మరీ కఠినంగా ఉంటుంది. ఆమె కు సన్నిహితంగా ఉండే వారిని కూడా చాలా సందర్భంలో బాధించినట్లుగా మాట్లాడింది.
బిగ్ బాస్ లో ఆమె యొక్క తీరును కొందరు తప్పుబడుతూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె యొక్క ప్రవర్తన పట్ల సమర్థించే విధంగా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పొచ్చు, మొత్తానికి గీతూ యొక్క దుడుకు స్వభావం ఆమె యొక్క ఆట పై ప్రభావం చూపిస్తుంది. ఇక ఇనాయా కూడా మొన్నటి వరకు బాగానే ఉన్నా ఆమె ఆట తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మరీ
వీరిద్దరు ఇలాగే కొనసాగితే కచ్చితంగా ముందు ముందు వీరిద్దరికి ప్రేక్షకుల నుండి మద్ద తు ఉండదు అంటూ కామెంట్స్  కూడా గట్టిగానే వస్తున్నాయి. రాబో యే రెండు మూడు వారాల్లో కచ్చితంగా వీరు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటుందని రివ్యూవర్స్‌ కామెంట్స్ తెగ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: