సురేందర్ రెడ్డి మనసులో ఆ హీరో!!

P.Nishanth Kumar
సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఎలాంటి సినిమాలను చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన సైరా సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఓ భారీ చిత్రాన్ని మళ్లీ  కానీ సురేందర్ రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అఖిల్ తో ఒక యాక్షన్ భరితమైన సినిమాను చేయడం మొదలుపెట్టారు.

ఆ విధంగా రెండు సంవత్సరాలుగా ఈ సినిమాతో నెట్టుకొస్తున్న సురేందర్ రెడ్డి ఇప్పుడు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. ఎన్నో భారీ చిత్రాల విడుదలలో ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ ఖాతరు చేయకుండా ఈ దర్శకుడు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించడం విశేషం. ఈ సినిమాకు ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడట. ఆ విధంగా మరి నిర్మాతగా ఆయన ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడా అన్నది చూడాలి.

ఈ సినిమా పనులు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది ప్రస్తుతం చాలామంది పెద్ద హీరోలు వేరే దర్శకులతో సినిమాలు చేయడానికి ఫిక్స్ అయిపోయారు ఒకవేళ సురేందర్ రెడ్డి సినిమా చేయాలనుకుంటే మళ్లీ ఒక యావరేజ్ హీరో తోనే సినిమా చేయవలసి ఉంటుంది. పెద్ద హీరోలు డేట్లు లేని కారణంగా వారితోనే సినిమా చేయవలసి ఉంటుంది అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి సంక్రాంతి తర్వాత ఆయన చేయబోయే తదుపరి సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని చాలామంది చెబుతున్నారు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. దర్శకుడిగా తనకు ఉన్న టెక్నిక్ ను ఇంతవరకు ఏ దర్శకుడు కూడా పట్టు కోలేదనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: