ఆదిపురుష్‌ విడుదల అవుతుందా? లేదా?

Satvika
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం లో వహిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా లో డార్లింగ్ రాముడిగా,బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‏కు మంచి స్పందన వస్తోంది. ఇక ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది.
 

అయితే కొద్ది రోజులుగా ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడిందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఆదిపురుష్ చిత్రం జనవరి లో కాకుండా ఫిబ్రవరిలో విడుదల కానుందట. దీంతో ప్రభాస్ చిత్రం మరింత ఆలస్యం కావడాని కి గల కారణమేంటంటూ నెట్టింట చర్చ షూరు చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో నే ఆదిపురుష్ రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తల పై మేకర్స్ స్పందించినట్లు గా తెలుస్తోంది. ఈ సినిమాకు సంక్రాంతి బరిలో ఎంత మంది పోటీకి దిగినా ఆదిపురుష్ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారట.

ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆదిపురుష్ చిత్రం కాకుండా ప్రభాస్ చేతి లో మరన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాధేశ్యామ్ తో నిరాశపరిచినా.. డార్లింగ్ తదుపరి చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబో లో రాబోతున్న సలార్ పైనే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: