ఆదిపురుష్: ఆ దేశంలో భారీగా.. న్యూ రికార్డ్?

Purushottham Vinay
పాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశావ్యాప్తంగా ఎనలేని గుర్తింపు పొందాడు. పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక నేడు ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఆదిపురుష్ టీజర్ రికార్డులు సృష్టించింది. అయితే కొందరు యానిమేషన్ సినిమా అని విమర్శలు కూడా చేశారు. అయినా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.


ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడుగా బాలీవుడ్ యువ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నాడు.అవతార్ సినిమాకి ఉపయోగించిన టెక్నాలజీ అయిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్స్‌లో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.ఇక USAలో అయితే  భారతీయ సినిమా చరిత్రలోనే ఆదిపురుష్ అతి పెద్ద 3D & IMAX స్క్రీన్‌లను విడుదల అవుతుంది. అంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. మరి చూడాలి ఆది పురుష్ అక్కడ ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో.లాస్ట్ టైం రాధే శ్యామ్ సినిమాతో పూర్తిగా నిరాశపరిచిన ప్రభాస్ ఈసారి ఆది పురుష్ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: