బింబిసార దర్శకునికి సూపర్ స్టార్ ఛాన్స్?

Purushottham Vinay
ఇక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు.ఇక అలాంటి వారిలో బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట కూడా ఒకరు.  నిజానికి ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అయిన మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వేణుగా 'ప్రేమలేఖ రాశా' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు.స్వయంగా సత్యనారాయణ నిర్మాతగా చేసిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. అంజలి హీరోయిన్గా విడుదలైన ఈ సినిమా అసలు విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. దీంతో ఇక హీరోగా మనకి వర్కౌట్ కాదనుకున్న వేణు సైలెంట్ అయిపోయి పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి సొంతంగా అద్భుతమైన కధ సిద్ధం చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ లాంటి చిన్న హీరోతో బింబిసార లాంటి ప్రాజెక్టు చేయడం రిస్క్ అని తెలిసిన ఆ రిస్క్ చేసి స్వయంగా కళ్యాణ్ రామ్ చేత డబ్బులు పెట్టించి, రిస్క్ చేయించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని మొదటి భాగం చివర్లోనే క్లారిటీ ఇచ్చారు, అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.


ఇక తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు వశిష్ట  ఇటీవల చెన్నై వెళ్లి రజినీకాంత్ ని కలిసినట్లు తెలుస్తోంది. బింబిసార టాక్ తెలుసుకున్న రజనీకాంత్ వేణు కథ చెప్పడానికి వస్తున్నానంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా చెన్నై వెళ్లిన వశిష్ట, రజినీకాంత్ కి తన కథ వినిపించారని తెలుస్తోంది. కథ మొత్తం విన్న తర్వాత రజనీకాంత్ ప్రస్తుతానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అలా అని రెడ్ సిగ్నల్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.కథ వినిపించిన తర్వాత రజినీకాంత్ ఎగ్జయిట్ అయ్యారని, త్వరలోనే ఫైనల్ కాల్ ఏమిటనే విషయం మీద క్లారిటీ ఇస్తానని వశిష్ట కి చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వేణుకి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆయన దశ తిరిగినట్లు చెప్పాలి. మొదటి సినిమాతోనే కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారతో హిట్టు ఆయన ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమా ఫైనల్ అయితే కనుక ఆయన కెరీర్ ఇంకెక్కడికో వెళ్లి పోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే రజనీకాంత్ బింబిసార గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇవ్వరా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: